Monday, January 20, 2025

అమెజాన్ ఇండియా నుంచి ‘బజార్’

- Advertisement -
- Advertisement -

తక్కువ ధర గల, అన్‌బ్రాండెడ్ ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఉత్పత్తుల విక్రయానికి ‘బజార్’ అనే విభాగాన్ని అమెజాన్ ఇండియా ప్రారంభించింది. కొత్త విభాగం అమెజాన్ ఇండియా ఆండ్రాయిడ్ యాప్‌లో అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన కొంత మంది వినియోగదారుల కోసం విభాగానికి యాప్‌లో ప్రముఖ స్థానం ఇచ్చినట్లు ఈ ప్లాన్ గురించిన తెలిసినవారు చెప్పారు. రూ. 600 లోపు ధర గల దుస్తులు, వాచీలు, పాదరక్షలు, ఆభరణాలు. లగేజి వంటి అన్‌బ్రాండెడ్ ఉత్పత్తుల కోసం ఇకామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా కొత్త విభాగాన్ని ప్రారంభించబోతున్నట్లు ఒక ఆంగ్ల దినపత్రిక ఫిబ్రవరిలోనే తెలియజేసింది. అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు ఉత్పత్తుల పంపిణీ సుమారు 4, 5 రోజులలో జరగవచ్చునని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News