Monday, December 23, 2024

ఫ్యూచర్‌తో అమెజాన్ చర్చల ప్రతిపాదన

- Advertisement -
- Advertisement -

చర్చల ద్వారా ఒక పరిష్కారానికి రండి
ఇరు పార్టీలను ఆదేశించి సుప్రీం కోర్టు

Amazon negotiates proposal with Future
న్యూఢిల్లీ : చాలా కాలంగా కొన్న న్యాయ పోరాటానికి ముగింపు పలికేందుకు ఇకామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఫ్యూచర్ గ్రూప్‌తో చర్చల ప్రతిపాదన తీసుకొచ్చింది. అదే సమయంలో కిషోర్ బియానీ నేతృత్వంలోని రిటైలర్ ఫ్యూచర్ ఒక తీర్మానానికి వచ్చేందుకు అంగీకరించింది. తుది నిర్ణయం తీసుకునేందుకు ఇరు పక్షాలకు సుప్రీంకోర్టు గురువారం 12 రోజుల గడువు ఇచ్చింది. అమేజాన్ తరపు సీనియర్ న్యాయవాది గోపాల్ సుబ్రమణియన్ మాట్లాడుతూ, ఒక పరిష్కారం దిశగా పరస్పరం చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కోర్టు తదుపరి విచారణను మార్చి 15కు వాయిదా వేసింది. అప్పటి వరకు మూడు పార్టీలు రిలయన్స్, అమెజాన్, ఫ్యూచర్ రిటైల్‌లు ఒక పరిష్కారాన్ని కనుగొనాలని సూచించింది. ఫ్యూచర్ రిటైల్ తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, ఫ్యూచర్ కూపన్స్ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఢిల్లీ హైకోర్టు, నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి)లో ఉన్న కేసులు గత షెడ్యూల్ ప్రకారం కొనసాగుతాయని కోర్టు పేర్కొంది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) నిర్ణయానికి వ్యతిరేకంగా అమెజాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్‌సిఎల్‌టి విచారిస్తోంది. ఫ్యూచర్ గ్రూప్‌లో అమెజాన్ 2019 పెట్టుబడిని సిసిఐ రద్దు చేసింది.

రిలయన్స్‌కు ఫ్యూచర్ రిటైల్ ఆస్తులు

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఫ్యూచర్ రిటైల్ తన రిటైల్ స్టోర్ ఆస్తులను క్రమంగా రిలయన్స్‌కు బదిలీ చేయనుంది. దీన్ని అడ్డుకునేందుకు అమెజాన్ కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది. ఒక సంవత్సరానికి పైగా అమెజాన్, ఫ్యూచర్ గ్రూప్ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటూ న్యాయపోరాటం చేస్తున్నాయి. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో 3.4 బిలియన్ డాలర్ల (రూ. 24 వేల కోట్లు) ఫ్యూచర్ గ్రూప్ ఆస్తుల విక్రయం నిలిచిపోయింది. కొన్ని ఒప్పంద ఉల్లంఘనలు అంటూ అమెజాన్ 2020 నుండి రిలయన్స్‌కు ఫ్యూచర్ గ్రూప్ ఆస్తులను విక్రయించకుండా ఆపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News