ఒక వంక పండుగ సీజన్ దగ్గర పడుతున్న తరుణంలో, తన తాజా క్యాంపెయిన్ ‘ఖుషియా అప్నోం కీ, ఔర్ అప్నీ భీ’ అమెజాన్’ను ప్రారంభించటం అమెజాన్ ఇండియాకు ఉత్కంఠ కలిగిస్తోంది. ఏడాదిలో ఆనందకరమైన సమయాలలో, తాము ప్రేమిస్తున్న వారికి ప్రాధాన్యమివ్వటం మాత్రమే కాకుండా, తమకు కూడా ప్రాధాన్యం ఇచ్చుకోవాలని కస్టమర్లకు ఉద్బోధించే ఒక విలక్షణమైన/మనసుకు హత్తుకునే విధానాన్ని ఈ క్యాంపెయిన్ అవలంబిస్తోంది. సాధారణంగా పండుగ సీజన్లలో మనం అభిమానించేవారికి బహుమతులు ఇస్తూ, ఆప్యాయతను పంచుకుంటూ, వారి ముఖాల పై చిరునవ్వులు చిందింపచేయటం జరుగుతుంటింది. అయితే, ఇతరుల పట్ల శ్రద్ధ వహిస్తూ ఉండిపోయి, మనం మన స్వంత సంరక్షణను మర్చిపోతూ ఉంటాము. మన స్వయం-సంరక్షణ/మనలను మనం ప్రేమించుకోవటానికి ఉన్న ప్రాధాన్యతను, మేములో ఉన్న నేనును ఈ పండుగ సీజన్లో హత్తుకోవలసిన అవసరాన్ని, మీకు సున్నితంగా గుర్తు చేసేందుకు ఈ క్యాంపెయిన్ పనికి వస్తుంది.
మేము, నేను కూడా సంతృప్తి చెందినప్పుడే నిజమైన సంబరాలు సాధ్యమవుతాయన్న అంతరార్ధాన్ని ఇతివృత్తంగా తీసుకున్న ఈ డిజిటల్ అసెట్, స్వయం-సంరక్షణ/తమను తాము ప్రేమించుకోవటం, స్వార్ధం కాదని, అవసరం అని గుర్తు చేసేందుకు ఉపకరిస్తుంది. ఈ వీడియోలో ఒక తల్లి, కూతురు మధ్య ప్రేమానురాగాలతో కూడిన ఈ అనుబంధాన్ని చూపటమైనది.
నూర్ పటేల్, వైస్ ప్రెసిడెంట్, అమెజాన్ ఇండియా ఇలా అన్నారు. “నేటి ప్రపంచంలో, ఎంతో అవసరమైన స్వయం-సంరక్షణ, స్వంత-గుర్తింపు అనే మధురమైన విషయాన్ని ఈ క్యాంపెయిన్ స్పృశిస్తుంది. మా క్యాంపెయిన్ కస్టమర్ మనోభావాలపై ఆధారపడినది, కస్టమర్ల ఉద్దేశ్యాలలో వస్తున్న మార్పులను సజీవంగా ముందు నిలుపుతుంది. తాము ప్రేమించే వ్యక్తుల అవసరాలు మాత్రమే కాక తమ అవసరాలు కూడా తీర్చుకుంటూ పండుగ వేడుకలను జరుపుకునేందుకు ఈ క్యాంపెయిన్ ప్రోత్సహిస్తుంది.”
ఈ పండుగ సీజన్లో, అమెజాన్ #ME_In_WE ను, “ఖుషియో అప్నోం కి, ఔర్ అప్నీ భి” క్యాంపెయిన్ ద్వారా మీ కోసం తీసుకువస్తోంది. ఈ కథలో ముందు, ఒక తల్లి పండుగ సందర్భంగా, ఇంట్లో తనను తప్ప మిగిలిన ప్రతివారిని దృష్టిలో పెట్టుకుంటూ ఏర్పాట్లు చేస్తూ ఉండటం కనిపిస్తుంది. మనం నిజజీవితాల్లో సాధారణంగా చూసే గృహిణుల లాగానే, తనకోసం ఏదైనా చేసుకునేందుకు ఏదో ఒక వంక చెప్పుకుని అది చేసుకోకుండా త్యాగం చేయటం కనిపిస్తుంది. అయితే ఒక చిన్న మలుపు దీనిలో గొప్ప మార్పు తీసుకువస్తుంది. ఆమె నిజంగా తన కోసం ఆలోచిస్తోందని ఆ మార్పు నిదర్శనాత్మకంగా చూపుతుంది. తల్లికి సంబంధించిన అద్భుతమైన హాస్యం, తల్లీ కూతుళ్ళ మధ్య నాటకీయమైన హావభావాలు, వెటకారాలు, ఇంకా అత్యద్భుతమైన భారతీయ ప్రేమాభిమానాలతో కూడిన చిన్న చిన్న అంశాలు, ఈ క్యాంపెయిన్ చూసేవారి ముఖాల పై చిరునవ్వులను చిందింపజేస్తాయి.
సెప్టెంబర్ 15, 2023న ఈ క్యాంపెయిన్ అన్ని డిజిటల్ మాధ్యమాల్లో ప్రారంభం అవుతుంది. క్యాంపెయిన్ చుట్టూ, ఒక ఆసక్తికరమైన యూజర్ సృష్టించిన కంటెంటు ప్లాన్ అల్లుకుని ఉన్నది. అది కస్టమర్లను, తమ “ఖుషియా అప్నోం కి, ఔర్ అప్నీ భీ ” కథలను పంచుకునేందుకు ప్రోత్సహిస్తుంది. విజేతలైన కథలను వివిధ మాధ్యమాల్లో ప్రచురించటం జరుగుతుంది.