Friday, November 22, 2024

ప్రేక్షకుల కోసం మరిన్ని సేవలు పెంచిన అమెజాన్

- Advertisement -
- Advertisement -

Amazon raised more services for the audience

హైదరాబాద్: అమెజాన్ ప్రైమ్ ద్వారా వీడియో చానళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. నేటి నుంచి ప్రేక్షకులకు ప్రైమ్ వీడియో చానల్ సేవలు అందిస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది ఇందులో భాగంగా డిస్కవరీ ప్లస్, లయన్స్‌గేట్‌ప్లే, ఈరోస్‌నౌ, డాక్యుబే, మ్యూబి, హోయ్‌చోయ్, మనోరమ మ్యాక్స్ షార్ట్ టీవి చానళ్లు అందుబాటులో ఉంటాయని ఆసంస్ద ప్రతినిధి గౌరవ్‌గాంధీ తెలిపారు. వీటి ద్వారా సుమారు 10వేల కార్యక్రమాలను చూసే అవకాశం ఉంటుందని ఇప్పటివరకు 11దేశాల్లో ఈసేవలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక నుంచి భారత్‌లోని ప్రైమ్ కస్టమర్లు కూడా ఓటీటీ సేవల రూపంలో వీటిని పొందవచ్చని వెల్లడించారు. చానల్ బట్టి రూ.299 నుంచి రూ. 1999 వరకు సంవత్సరం చందా చెల్లించాల్సి ఉంటుందని, ప్రారంభ ఆఫర్‌గా చందాలపై 25శాతం నుంచి 40శాతం వరకు రాయితీ అందిస్తున్నట్లు చెప్పారు. రానున్న కొద్ది నెలల్లో మరిన్ని వీడియో చానళ్లు ప్రైమ్ ద్వారా అందుబాటులోకి వస్తాయని వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News