Friday, January 17, 2025

అమెజాన్ షాక్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఐఐటి, ఎన్‌ఐటిల్లో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించిన టెక్ దిగ్గజం అమెజాన్ ఆఫర్ లెటర్లను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఇటీవల ఐఐటి బాంబేలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారిని అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ల పాత్ర కోసం ఎంపిక చేసింది. జూన్‌లో వారు చేరాల్సి ఉండగా, ఈ ఆఫర్ లెటర్‌ను జనవరి నెల వరకు వాయిదా వేస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది.

ఒక ఇంజినీర్ మాట్లాడుతూ, ఎస్‌డిఇ1 వద్ద తనను అమెజాన్ ఎంపిక చేయగా, జూన్‌లో చేరాల్సి ఉందని అన్నారు. కానీ ఆఫర్‌ను వాయిదా వేశామంటూ హెచ్‌ఆర్ నుంచి ఇమెయిల్ వచ్చింది, జనవరిలో చేరాలని కంపెనీ మెయిల్‌లో వెల్లడించిందని ఆ విద్యార్థి తెలిపారు. ఇది ఐఐటి క్యాంపస్‌లోని వారందరీ వచ్చిందని, వారి ఆఫర్ లెటర్‌ను వాయిదా వేస్తున్నట్టు మెయిల్ చేశారని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News