Monday, November 25, 2024

ఇడిపై అమెజాన్ దావా

- Advertisement -
- Advertisement -

Amazon sues ED

న్యూఢిల్లీ : రెండేళ్ల క్రితం అంటే 2019 సంవత్సరంలో జరిగిన ఒప్పందానికి సంబంధించి దర్యాప్తును రద్దు చేయాలని కోరుతూ ఇకామర్స్ దిగ్గజం అమెజాన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి)పై కోర్టును ఆశ్రయించింది. విదేశీ పెట్టుబడుల చట్టాల ఉల్లంఘన ఆరోపణల మేరకు భారతీయ సంస్థ ఫ్యూచర్ గ్రూప్‌లో 200 మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్‌పై ఇడి కొద్ది నెలలుగా దర్యాప్తు చేపడుతోంది. ఇటీవల వారాల్లో అమెజాన్ ఎగ్జిక్యూటివ్‌లకు ఇడి సమన్లు జారీ చేసిందని, విచారణ పేరిట అనవసరంగా వేధిస్తోందంటూ ఈ నెల 21న ఢిల్లీ హైకోర్టులో అమెజాన్ పిటిషన్ దాఖలు చేసింది.

కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో 3.4 బిలియన్ డాలర్ల ఒప్పందంలో ఫ్యూచర్ గ్రూప్ నిబంధనలను ఉల్లంఘించిందంటూ అమెజాన్ న్యాయ పోరాటం చేస్తూ వస్తోంది. అయితే ఇటీవల ఫ్యూచర్ కూపన్‌అమెజాన్ ఒప్పందాన్ని సిసిఐ(కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) రద్దు చేసింది. అంతేకాదు వాస్తవాలను దాచిందనందుకు గాను అమెజాన్‌పై రూ.200 కోట్ల జరిమానా కూడా విధించింది. ఫ్యూచర్ కూపన్‌తో డీల్ నిబంధనల పేరుతో అమెజాన్ చాలా కాలంగా రిలయన్స్‌ఫ్యూచర్ ఒప్పందాన్ని అడ్డుకుంటూ వస్తోంది. డీల్‌కు సంబంధించి వాస్తవ విషయాలను అమెజాన్ అణచివేసిందని, ఆమోదం కోరే సమయంలో తప్పుడు ప్రకటనలు చేసిందని సిసిఐ ఆర్డర్‌లో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News