Sunday, January 12, 2025

క్విక్ కామర్స్ సేవలు తేబోతున్న అమెజాన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ఈ నెలాకరులోనే క్విక్ కామర్స్ అందుబాటులోకి తేబోతోంది. ఈ విషయాన్ని ఆ కంపెనీ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ తెలిపారు. ఈ సేవలని అందించాలని అమెజాన్ ఎప్పటి నుంచో అనుకుంటోంది. తొలుత బెంగళూరులో ఈ సర్వీసులను అందుబాటులోకి తేబోతున్నారు. 15 నిమిషాల క్విక్ కామర్స్ విభాగంలో అమెజాన్ ఎంట్రీ ఇవ్వడం ఇదే తొలిసారి. ప్రస్తుతం బ్లింకిట్, స్విగ్గీ, జెప్టో, ఫ్లిప్ కార్ట్ వంటివి ‘మినిట్స్’ పేరిట క్విక్ కామర్స్ సేవలకు శ్రీకారం చుట్టాయన్నది తెలిసిన విషయమే. ఇక రిలయన్స్, టాటా గ్రూపులు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News