Saturday, November 23, 2024

రూ.36,300 ‘కోట్లు’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణకు ప్రపంచ అగ్రశ్రేణి ఐటి కంపెనీలు క్యూకడుతున్నాయి. అంతటా లేఆఫ్‌లు, మాంద్యం ప్రభావం కనిపిస్తుండగా రాష్ట్రంలో మాత్రం ఐటి రంగంలో మునుపెన్నడు లేని జోష్ కనిపిస్తోంది. రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు నిరంతరంగా చేస్తున్న ప్రయత్నాలు బడా ఐటి కంపెనీలను విశేషంగా ఆకర్శిస్తున్నాయి. నిన్న మైక్రోసాఫ్ట్, నేడు అమెజాన్ కంపెనీలు వేలకోట్ల పెట్టుబడులే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. భారీ పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రముఖ ఇంటర్నేషనల్ ఇ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ప్రకటించింది.

అమెజాన్ వెబ్ సర్వీసెస్ సెంటర్‌లో ఈ పెట్టుబడులు పెంచుతున్నట్లు వెల్లడించింది. 2030 నాటికి మొత్తంగా రూ. 36,300 కోట్లను వెచ్చించనుంది. ఈ విషయాన్ని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఎడబ్ల్యూఎస్ ఎంపవర్ ఇండియా ఈవెంట్‌లో అమెజాన్ సంస్థ తెలియజేసింది. దీనిపై రాష్ట్ర ఐటి, పరిశ్రమల శా ఖ మంత్రి కె. తారకరామారావు స్పందిస్తూ, అమెజాన్ సంస్థ చేసిన ప్రకటనను స్వాగతించారు. వెబ్ సర్వీసెస్ విస్తరణలో భాగంగా అదనపు పెట్టుబడి పెట్టడానికి ఆ సంస్థ ముందుకురావడం అభినందనీయమని వ్యాఖ్యానించారు.

అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏషియా పసిఫిక్ రీజియ న్ కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌లో రూ.36 వేల కోట్లకు పైగా నిధులను పెట్టుబడిగా పెడుతుండ డం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని కెటిఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎంపవర్ ఇండియా ఈవెంట్‌లో దావోస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి కెటిఆర్ పాల్గొని ప్ర సంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ, అమెజాన్ సంస్థ భారీ పెట్టుబడులతో డేటా సెంటర్ ప్రధాన కేంద్రంగా తెలంగాణ మారుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అమెజాన్ సం స్థకు, తెలంగాణ రాష్ట్రానికి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయన్నారు.

ఈ నేపథ్యంలో సంస్థ విస్తరణ ప్రణాళికలకు రాష్ట్ర పక్షాన పూర్తిస్థాయిలో త మ సంపూర్ణ సహకారం ఉంటుందని కెటిఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ డేటా సెంటర్‌లో పె ట్టుబడులను అమెజాన్ విస్తరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోకి వస్తున్న అతిపెద్ద ఎఫ్‌డిఐలలో ఇదొకటన్నా రు. ఇగవర్నెన్స్ హెల్త్‌కేర్, పురపాలక కార్యకలాపాలను మెరుగుపరచడానికి ఎడబ్లూఎస్‌తో కలి సి తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. హై దరాబాద్‌లోని అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్యాంపస్‌లతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో పాటు స్టార్టప్ లకు ప్రయోజనం కలుగుతుందన్న నమ్మకం తన కు ఉందని ఈ సందర్భంగా కెటిఆర్ పేర్కొన్నారు.

మూడు డేటా సెంటర్లు

భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులకు అత్యుత్తమ క్లౌడ్ సేవలను అందించాలన్న లక్ష్యంలో భాగంగా హైదరాబాద్ చందన్‌వెల్లి, ఫ్యాబ్ సిటీ, ఫార్మా సిటీలో మూడు డేటా సెంటర్ లను అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏర్పాటుచేసింది. ఈ మూడు డేటా సెంటర్ ల మొదటి దశ పూర్తై వినియోగదారులకు పూర్తిస్థాయిలో క్లౌడ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మూడు డేటా సెంటర్లలో మొదట (2020లో) 20 వేల 96 కోట్ల రూపాలయను పెట్టుబడిగా పెట్టాలని అమెజాన్ నిర్ణయించింది. అయితే విస్తరణ ప్రణాళికలు, వ్యాపార వ్యూహాల్లో భాగంగా దశల వారీగా 36 వేల 300 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టాలని తాజాగా నిర్ణయించుకుంది. ప్రపంచంలోనే తన అతిపెద్ద వెబ్ సర్వీసెస్ క్యాంపస్ తో పాటు ఫుల్ ఫిల్మెంట్ సెంటర్ లు రెండింటిని హైదరాబాద్ లో అమెజాన్ ఏర్పాటుచేసింది. ఇక అమెజాన్ వెబ్ సర్వీసెస్ అందించే క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News