Monday, January 20, 2025

అమెజాన్ ఉద్యోగాల కోత భారత్‌లోనే ఎక్కువ

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ : ఇకామర్స్ దిగ్గజం అమెజాన్ ఉద్యోగాల కోత ప్రకటన చేసింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 వేల మందిపై వేటు వేయనున్నట్టు సంకేతాలు ఇచ్చింది. అయితే ఈ తొలగింపు ప్రక్రియలో ఎక్కువగా భారత్‌పైనే ప్రభావం ఉండనుందని తెలుస్తోంది. ఇకామర్స్, వెబ్ సర్వీసెస్, వీడియో స్ట్రీమింగ్‌తో పాటు భారతదేశంలో అమెజాన్ అనేక వ్యాపారాలను నిర్వహిస్తోంది. అమెజాన్ ప్రపంచ వ్యాప్తంగా తొలగిస్తామన్న 10 వేల మందిలో ఎక్కువ మంది భారతీయులు ఉండనున్నారని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, వచ్చే వారంలో అమెజాన్‌లో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోవచ్చు. గత కొన్ని త్రైమాసికాలుగా సంస్థ లాభాలు ఆశించిన మేరకు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

ఆర్థిక మాంద్యం నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీ తన ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తోంది. కంపెనీ గత వారం కూడా హైరింగ్ ఫ్రీజ్‌ను ప్రకటించింది. వచ్చే ఐదేళ్లలో ప్యాకేజింగ్ 100 శాతం రోబోటిక్ సిస్టమ్‌గా మారుతుందని అమెజాన్ రోబోటిక్స్ చీఫ్ టై బ్రాడీ చెప్పారు. భవిష్యత్తులో ఉద్యోగుల స్థానంలో రోబోలు వస్తాయని, దీనికి చాలా సమయం పడుతుందని ఆయన తెలిపారు. కంపెనీలో పని ఖచ్చితంగా మారుతుందని, కానీ మానవ అవసరం ఎప్పుడూ ఉంటుందని బ్రాడీ అన్నారు. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లు ఇప్పటికే తమ ఉద్యోగులను తొలగించాయి. ట్విట్టర్ తన మొత్తం 7500 మంది ఉద్యోగుల్లో సగం మందిని, అలాగే కాంట్రాక్ట్ సిబ్బందిని తొలగించింది. ఇక ఫేస్‌బుక్‌కు చెందిన మెటా 13 శాతం సిబ్బందిపై వేటు వేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News