Monday, December 23, 2024

సుహాస్ అంటే చాలా ఇష్టంః అడివి శేష్

- Advertisement -
- Advertisement -

సుహాస్ హీరోగా జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు‘. దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శుక్రవారం థియేటర్స్ ద్వారా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో హీరో అడివి శేష్ అతిథిగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అడివి శేష్ మాట్లాడుతూ “సుహాస్ అంటే నాకు చాలా ఇష్టం.

ఈ మూవీ ట్రైలర్‌ను పదిసార్లు చూశా. అంత బాగా నచ్చింది. శరణ్య, శివానీ , సుహాస్ పోటీపడి నటించారు. శుక్రవారం మనమంతా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు‘ సినిమా బ్యాండ్ మోగించాలి”అని అన్నారు. దర్శకుడు దుశ్యంత్ కటికనేని మాట్లాడుతూ అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా టీజర్, ట్రైలర్ ఎంతగా నచ్చాయో…సినిమా అంతకంటే బాగుంటుందని తెలిపారు. నిర్మాత ధీరజ్ మొగలినేని మాట్లాడుతూ “మా డైరెక్టర్ దుశ్యంత్ ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు‘ స్క్రిప్ట్ చేసిన విధానం ఎంతో సహజంగా అనిపించింది.

సుహాస్ లేకుంటే ఈ సినిమా లేదు”అని పేర్కొన్నారు. హీరో సుహాస్ మాట్లాడుతూ ఇప్పటిదాకా నేను చేసిన మూవీస్‌లో ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు‘కు బెస్ట్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చానని చెప్పగలనని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌కేఎన్, బన్నీ వాస్, సాయి రాజేశ్, కరుణ కుమార్, అనిల్ విశ్వనాథ్, శివాని నాగరం, శరణ్య ప్రదీప్, భార్గవి, కల్యాణ్ చక్రవర్తి, పవన్ కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News