Wednesday, January 22, 2025

కామెడీ డ్రామా కథతో…

- Advertisement -
- Advertisement -

సుహాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు‘. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు.

కామెడీ డ్రామా కథతో తెరకెక్కుతున్న‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు‘ సినిమా త్వరలో థియేటర్స్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా టీజర్‌ను సోమవారం హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మారుతి, హను రాఘవపూడి, శైలేష్ కొలను, సాయి రాజేశ్, సందీప్ రాజ్, ప్రశాంత్, మెహర్, భరత్ కమ్మ. ఎస్కేఎన్, బిస్కట్ శరత్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ “-ఈ సినిమా పోస్టర్, టైటిల్ చూసినప్పుడే వీళ్లు ఎంత నేటివ్‌గా కథను తెరకెక్కిస్తున్నారో అర్థమైంది.

సుహాస్ చేస్తున్నఈ మూవీ పెద్ద హిట్ కావాలి”అని అన్నారు. హీరో సుహాస్ మాట్లాడుతూ – “అంబాజీపేట మ్యారేజి బ్యాండు‘ సినిమా ఇంత బాగా రూపుదిద్దుకోవడానికి మా ప్రొడ్యూసర్స్ కారణం. లక్ష్మీ క్యారెక్టర్‌లో బాగా నటించింది నా కోస్టార్ శివానీ”అని తెలిపారు. డైరెక్టర్ దుశ్యంత్ కటికినేని మాట్లాడుతూ “అంబాజీపేట మ్యారేజి బ్యాండు మూవీకి అల్లు అరవింద్, బన్నీ వాసు, ధీరజ్, వెంకటేష్ మహా ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. నాతో మూవీ చేసినందుకు సుహాస్‌కు థ్యాంక్స్ చెబుతున్నా”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శివానీ నాగరం, శరణ్య ప్రదీప్, జగదీశ్, నితిన్, వాజిద్ బేగ్, శేఖర్ చంద్ర పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News