Monday, December 23, 2024

అంబానీ కోడలి శారీ ఖరీదు తెలిస్తే షాక్ అవుతారు

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ పెద్దకోడలు రాధికా మర్చంట్ భారతదేశంలో ముఖ్యమైన సెలబ్రిటీలలో ఒకరు. అందంలోనే కాక వస్త్రధారణలో సైతం ఆమె ఏ సినిమా స్టార్‌కు తీసిపోరు. ఆమె ఏ ఈవెంట్‌లో పాల్గొన్నా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉండడం ఆమె ప్రత్యేకత. తాజాగా..మార్చి 31వ తేదీన ముంబైలో నీతా ముకేష్ అంబానీ కల్చరల్ సెంటర్(ఎన్‌ఎంఎసిసి) ప్రారంభోత్సవానికి తన భర్త అనంత్‌తో కలసి రాధికా మర్చెంట్ హాజరై హాట్ టాపిక్‌గా మారిపోయారు.
ప్రారంభోత్సవానికి ప్రపంచ నలుమూలలకు చెందిన చాలామంది ప్రముఖులు హాజరు కాగా రాధిక ధరించిన చీరెను చూసి అక్కడున్నవారంతా ఫిదా అయిపోయారు. నలుపు రంగు శారీపై వైట్ ఫ్లోరల్ థ్రెడ్‌తో చేసిన ఎంబ్రాయిడరీ వర్క్ కళ్లు చెదిరిపోయేంత అందంగా ఉంది. షాహబ్-దురాజీ డిజైన్ చేసిన ఈ శారీ ఖరీదు అక్షరాలా రూ. 5.85 లక్షలని తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News