Friday, December 20, 2024

కెటిఆర్‌తో సమావేశమైన డొమినిక్ రిపబ్లిక్ రాయబారి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్:  ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో భారత్‌లోని డొమినికన్ రిపబ్లిక్ రాయబారి  డేవిడ్ ప్యూగ్ హైదరాబాద్‌లో సోమవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా గత కొద్ది సంవత్సరాలుగా తెలంగాణలో జరుగుతున్న ఐటి , పారిశ్రామిక రంగాలలో అపూర్వమైన వృద్ధిని మంత్రి మంత్రి కేటిఆర్ వివరించారు. డొమినికన్ రిపబ్లిక్‌తో తెలంగాణకు ఐటి, ఇన్నోవేషన్, ఫార్మా, ఉన్నత విద్య రంగాలలో ఉన్న సహయ,సహకారాలపై ఆయనతో మంత్రి చర్చించారు. డొమినికన్ రిపబ్లిక్ కరేబియన్, మధ్య అమెరికా ప్రాంతంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటి అన్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, బిఆర్‌ఎస్ నాయకుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

David and KTR

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News