Thursday, January 23, 2025

చెన్నై టీమ్‌కు అంబటి బిర్యానీ విందు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడేందుకు నగరానికి చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు అరుదైన విందు లభించింది. సిఎస్‌కె మాజీ ఆటగాడు అంబటి రాయుడు చెన్నై ఆటగాళ్లకు విందు ఏర్పాటు చేశాడు. రాయుడు తన ఇంటిలో ఏర్పాటు చేసిన విందుకు సిఎస్‌కెకు చెందిన పలువురు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ బిర్యానీతో పాటు ప్రత్యేక వంటకాలను అతిథులకు రాయుడు వడ్డించాడు. కాగా, తమకు ప్రత్యేక విందును ఏర్పాటు చేసిన రాయుడుకు సిఎస్‌కె ఆటగాళ్లు థాంక్స్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News