Friday, December 20, 2024

చంద్రబాబే క్యాన్సర్ గడ్డ: అంబటి రాంబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకున్న ప్రతీ పార్టీని మోసం చేశారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. సోమవారం అంబటి మీడియాతో మాట్లాడారు. పవన్ వారాహిని ఎందుకు కొన్నాడో… ఎందుకు దాచాడో అర్థం కావడం లేదన్నారు. పవన్ కల్యాణ్ ఎప్పుడూ చంద్రబాబు కోసమే తాపత్రయపడుతాడన్నారు. రామోజీరావుపై వైసిపి ప్రభుత్వం కక్ష సాధింపు అనేది విడ్డూరంగా ఉందన్నారు. రామోజీ తప్పు చేయకపోతే విచారణకు ఎందుకు భయపడుతున్నాడని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అని విమర్శించారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి విద్యా, వైద్య రంగాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని ప్రశంసించారు. టిడిపి నేత లోకేష్ పాదయాత్రపై మాట్లాడుకోవడం అనవసరమని ఎద్దేవా చేశారు.

తన నియోజకవర్గంలో అసమ్మతి అనేది కేవలం మీడియా ప్రచారమని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టు వైఎస్‌ఆర్ కల అని చెప్పారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పోలవరం ప్రారంభిస్తే… సిఎం జగన్ మోహన్ రెడ్డి పూర్తి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. పోలవరం పనుల్లో జాప్యానికి చంద్రబాబు చేసిన పాపాలే కారణమని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం తప్పువల్లే 2022 కోట్ల అదనపు భారం పడిందన్నారు. టిడిపి పాలనలో 72 శాతం పనులు అబద్ధమన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేశామని పవన్ కల్యాణ్ తప్పుడు వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News