Tuesday, April 22, 2025

ఆ మూడు వేల కోట్ల కోసమే పిఎస్ఆర్, కసిరెడ్డి అరెస్టు?: అంబటి రాంబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: వైసిపి నేత, మాజీ ఎంపి గోరంట్ల మాధవ్ కేసులో హోంమంత్రి రాజీనామా చేయాలని వైసిపి నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. పోలీసులను సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదని, అక్రమ అరెస్ట్‌లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విజయసాయిరెడ్డి చంద్రబాబు చేతుల్లోకి వెళ్లారని, పార్టీని వీడి వైసిపి నేతలపై విమర్శలు చేస్తే భయపడతామా? అని మండిపడ్డారు. అడ్డదిడ్డంగా మాట్లాడేవారికి ఏం సమాధానం ఇస్తామని దుయ్యబట్టారు. జత్వాని బ్లాక్ మెయిలర్ అని, ముంబయిలో ఆమె గురించి అందరికి తెలుసునని అంబటి రాంబాబు విమర్శలు చేశారు. ఉర్స్ కు మూడు వేల కోట్ల ఆస్తులను కట్టబెట్టారని, ఉర్స్ విషయం బయటరాకుండా ఉండేందుకు పిఎస్ఆర్ ఆంజనేయులు, కసిరెడ్డిని అరెస్టు చేశారని, ఈ విషయంలో మీడియాను డైవర్ట్ చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు డైవర్ట్ పాలిటిక్స్ చేయడంలో నంబర్ వన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ స్కామ్ లేకుండా కసిరెడ్డిని ఎలా అరెస్టు చేస్తారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఎస్టిమేషన్లు పెంచి ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారని ఆరోపణలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News