Friday, January 24, 2025

పవన్ ది శునకానందం.. నా డ్యాన్స్ సింక్ అవలేదట: అంబటి రాంబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్ సిపి మంత్రి అంబటి రాయుడు మరో సారి సంచనల వ్యాఖ్యలు చేశారు. నేను ఎవరి దగ్గరో డబ్బులు తీసుకుని, ప్యాకేజీలు తీసుకుని డ్యాన్స్ వేయను. పవన్ ది శునకానందం అని మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. సంక్రాంతికి నేను వేసిన డ్యాన్స్ ఆనంద తాండవం.. నా డ్యాన్స్ సింక్ అవలేదట.. నేను ఏమైనా డ్యాన్స్ మాస్టర్ నా?, పవన్ రాజకీయాలకు సింక్ అవ్వడు అని అంబటి రాంబాబు వెల్లడించారు.

”బ్రో సినిమాలో నా క్యారెక్టర్ పెట్టి అవమానించారని విన్నాను. బ్రో సినిమా చూడలేదు. కానీ, నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక పవన్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు.. ఎవరో డబ్బులు పెట్టి తీసిన సినిమాలో నటిస్తూ నా క్యారెక్టర్ పెట్టి ఆనంద పడుతున్నాడు” మంత్రి అంబటి మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News