Friday, December 20, 2024

టిడిపి తప్పిదాలతోనే పోలవరం ఆలస్యం: అంబటి

- Advertisement -
- Advertisement -

అమరావతి: వైసిపి ప్రభుత్వంపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును మంత్రి అంబటి పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులపై మంత్రి ఆరా తీశారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. గతంలో టిడిపి ప్రభుత్వం తప్పిదం వలనే పోలవరం ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయని వెల్లడించారు. గత ప్రభుత్వం ప్రోటోకాల్‌కు విరుద్ధంగా పనులు చేపట్టిందన్నారు. కాపర్ డ్యామ్ కు మూడు సంవత్సరాల కాల పరిమితి మాత్రమే ఉంటుందని ఆ సమయంలో పోలవరం డ్యామ్ నిర్మించాలన్నారు. లోయర్, ఆప్పర్ కాపర్ డ్యామ్‌లను మూసివేసినప్పుడ ఎగువన ఉన్న 54 గ్రామాలు నీళ్లలో మునిగిపోతాయని ప్రజలు సిడబ్ల్యుసికి పిటిషన్ పెట్టుకున్నారని అంబటి వివరించారు.

Also Read: కొడుకు చదువు కోసం తల్లి ప్రాణత్యాగం

సిడబ్ల్యుసి కాపర్ డ్యామ్‌లను ఆపమని టిడిపి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిందని, డయాఫ్రమ్ వాల్ కొట్టుకొని పోవడానికి కారణం వరదలు కాదని, కాపర్ డ్యామ్ పూర్తి చేయకపోవడం అసలు నిజాలు అని అంబటి చెప్పారు. లోయర్, అప్పర్ కాపర్ డ్యామ్‌లు పూర్తి చేయకుండా చంద్రబాబు వదిలి వెళ్లిపోయారని, దీంతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని పేర్కొన్నారు. గోదావరి నీళ్లను మరో వైపు మళ్లించకుండాను కాపర్ డ్యామ్‌లు సగం నిర్మించారని, మరో డయాఫ్రమ్ వాల్ మధ్యలోనే వదిలేశారని అంబటి దుయ్యబట్టారు. వైఎస్‌ఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాత స్పిల్ వే నిర్మించామని, అప్రోచ్ వే, పైలట్ వే నిర్మించి గోదావరి నది నీళ్లను పక్కకు తరలించామన్నారు. లోయర్, అప్పర్ కాపర్ డ్యామ్‌లతోనే ఇబ్బందులు వచ్చాయని చెప్పారు. గత ప్రభుత్వంపై తాను విమర్శలు చేయడం లేదని వాస్తవాలు గ్రహించాలని ప్రజలను కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News