తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఆదివారం తెలుగు ప్రజలు భోగీ సంబరాలను జరుపుకుంటున్నారు. ఏపీ గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు భోగి కార్యాక్రమంలో సందడి చేశారు. బోగీ సంబరాల్లో తన డ్యాన్స్ లతో అలరించారు. సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన బోగీ కార్యక్రమాల్లో కళాకారులతో కలిసి రాంబాబు చిందులు వేస్తూ ప్రజలను ఉత్సాహపర్చారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ భోగీ, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
భోగి,సంక్రాంతి శుభాకాంక్షలు! pic.twitter.com/Tmtt5TDLMP
— Ambati Rambabu (@AmbatiRambabu) January 14, 2024
కాగా, మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి వేడుకల్లో తొలిరోజు భోగి వేడుకలను తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. వేకువజామున లేచి భోగి మంటలు వేశారు. భోగి మంటల చుట్టూ ప్రజలు ఆటపాటలతో సందడి చేశారు. గ్రామాలల్లో హరిదాసులు, గంగిరెద్దులు, డీజే పాటలతో సంక్రాంతి పండగ వాతారవరణం ఉట్టిపడుతోంది.