Sunday, January 19, 2025

బాబుకు కాపు కులాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి పవన్: అంబటి రాంబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారని వైసిపి నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. పవన్ పై అంబటి విమర్శలు గుప్పించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరుపై గోదావరి జిల్లా కాపులంతా అసహనంతో ఉన్నారని, పవన్ విషయంలో మీరు చెప్పింది నిజమేనని లబోదిబోమంటున్నారని, బాబుకు కాపు కులాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి పవన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ డైలాగ్‌లు సినిమాల్లోనే పని చేస్తాయని, రాజకీయాల్లో పని చేయవన్నారు. తాను అసెంబ్లీకి వెళ్లకుండా టిడిపి, జనసేన, బిజెపి అడ్డుకోవాలని ప్రయత్నిస్తుందని, 2019 ఎన్నికలలో వచ్చి మెజార్టీ కన్నా ఈ సారి ఒక్క ఓటు తక్కువ వచ్చినా తాను ఓడినట్టేనని అంబటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎపిలో మరోసారి వైసిపి ప్రభుత్వం ఏర్పడుతుందని, జగన్ రెండోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని జోస్యం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News