Friday, December 27, 2024

గోదావరి జిల్లాల్లో ఎందుకు తిరుగుతున్నావు: అంబటి రాంబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: వారాహి ఎక్కి జనసేన అధినేత పవన్ కల్యాణ్ అవాస్తవాలు, అసత్యాలు మాట్లాడుతున్నారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శుక్రవారం పవన్ మీడియాతో మాట్లాడారు. పవన్ యాత్రతో వారాహి సైతం వరాహం అయిపోతుందని ఎద్దేవా చేశారు. మాటపై నిలకడలేని వ్యక్తిత్వం పవన్‌ది అని విమర్శించారు. పవన్ స్టార్ట్ చేసిన కామన్ మెన్ ప్రొటక్షన్ ఏమైందని అడిగారు. పవన్ అప్పుడే ఊగిపోతాడని, అప్పుడే సాగిపోతాడని, సంస్కారం కోసం పవన్ మాట్లాడ్డం విడ్డూరంగా ఉందని అంబటి ధ్వజమెత్తారు. చెప్పులు పట్టుకొని బూతులు మాట్లాడినప్పుడు సంస్కారం ఏమైందని నిలదీశారు. కల్యాణ్ అనే పేరును పవన్ సార్థకం చేసుకున్నారని దుయ్యబట్టారు. గోదావరి జిల్లాల్లోనే పవన్ ఎందుకు తిరుగుతున్నారని అంబటి అడిగారు. వాలంటీర్ల గురించి మాట్లాడడం దారుణంగా ఉందని మండిపడ్డారు.

Also Read: చంద్రబాబు కట్టప్ప రేవంత్ రెడ్డి: గండ్ర

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News