- Advertisement -
అమరావతి: అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి-జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్ కల్యాణ్ చెప్పడంతో మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. జనసైనికులు ఆలోచన చేయాలని, ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడిలా లేదూ అని అన్నారు. ఇప్పుడే నిర్ణయం తీసుకున్నామని అంటే ఎవరైనా నమ్మే పిచ్చోళ్లు లేరని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను పరోక్షంగా విమర్శించారు.
Also Read: తెలంగాణలో తప్ప.. ఝార్ఖండ్, బీహార్ లో కూడా టైంకు జీతాలు పడుతున్నాయి..
టిడిపి-జనసేన పొత్తుపై వైఎస్‌ఆర్‌సిపి ట్విట్ చేసింది. ప్యాకేజీ బంధం బయటపడిందని, టిడిపితో పొత్తు ఖాయం కోసమే టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును జనసేన అధినేత పవన్ కలిశారన్నారు. పవన్‌ను నమ్ముకున్న అభిమానుల భ్రమలు తొలిగిపోయాయని, ఇది పొత్తులు, ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం అని వైసిపి తెలిపింది.
- Advertisement -