హైదరాబాద్: వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. పిచ్ నెమ్మదిగా ఉండడంతో టీమిండియా ఓడిపోయిందని అంబటి రాయుడు తెలిపాడు. టాస్‌కు అసలు ప్రాధాన్యనమే ఉండకూడదని, ఫైనల్‌లో పిచ్‌ను ఆ విధంగా తయారు చేయాల్సింది కాదని విమర్శించారు. వరల్డ్ ఫైనల్ మ్యాచ్ లో వాంఖేడ్ స్టేడియంలో పిచ్ చాలా నెమ్మదిగా ఉందని, పిచ్ ఇలా తయారు చేయాలన్నది ఎవరో ఆలోచనో తనకు తెలియదన్నారు. బ్యాటింగ్, బౌలింగ్‌కు సమానంగా అనుకూలించే పిచ్ అయితే బాగుండునని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆస్ట్రేలియాతో పోలిస్తే భారత జట్టు బ్యాటింగ్ పరంగా బలంగా ఉందని చెప్పారు. ఫైనల్‌లో మాత్రం టీమిండియా అంచనాలకు తగినట్టుగా రాణించలేదని, ఎలాంటి జట్టునైన ఓడించే సత్తా మన జట్టుకు మాత్రమే ఉందన్నారు. పిచ్ మొదటి నుంచి అఖరి వరకు ఓకేలా ఉండే తయారు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఫైనల్‌లో ఆ విధంగా పిచ్ ను తయారు చేయాల్సింది కాదు: రాయుడు
- Advertisement -
- Advertisement -
- Advertisement -