Wednesday, January 22, 2025

సీఎం వైఎస్‌ జగన్‌తో అంబటి రాయుడు భేటీ

- Advertisement -
- Advertisement -

అమరావతి: తెలుగు క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అంబటి రాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డిని ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసిపి)తో పొలిటికల్ కెరీర్ గురించి పుకార్లు జోరందుకున్నాయి. గత కొన్ని వారాలుగా, వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ముఖ్యమంత్రికి తన మద్దతు గురించి రాయుడు ఎక్కువగా మాట్లాడుతున్న విషయం తెలిసిందే. ఇది అతని రాజకీయ ఆకాంక్షల గురించి పెరుగుతున్న ఊహాగానాలకు దారితీసింది.

రాయుడు తెలుగుదేశం పార్టీ (టిడిపి)లో చేరతారని విస్తృతమైన ఊహాగానాలు ఉండగా, ఇటీవల సిఎం జగన్‌పై ఆయన ప్రశంసలు కురిపించడంతో ఎపి రాజకీయాల్లో రాయుడు హాట్ టాపిక్ గా మారాడు. గుంటూరుకు చెందిన రాయుడు 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైరయ్యాడు. అయితే 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News