Tuesday, January 28, 2025

సూపర్ స్టార్ దొరికాడు… మూడు ఫార్మాట్లలో అవకాశం కల్పించాలి: అంబటి రాయుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సాహసోపేతమైన ఇన్నింగ్స్‌ తిలక్ వర్మ ఆడడంతో రెండో టి20లో భారత జట్టు ఘన విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు 19.2 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి చేధించింది. తిలక్ వర్మ 72 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. తిలక్ వర్మను భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రశంసించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టి20లో గొప్ప పరిపక్వత సాధించారన్నారు. టీమిండియాకు గొప్ప బ్యాట్స్‌మెన్ దొరికాడని, తిలక్ టి20 ప్లేయర్ మాత్రమే కాదని, మూడు ఫార్మాట్ ఆడే సత్తా ఉందని అంబటి రాయుడు మెచ్చుకున్నారు.

తిలక్‌పై మేనేజ్‌మెంట్, కెప్టెన్, కోచ్ పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేశాడని పేర్కొన్నారు. గత నాలుగు ఇన్నింగ్స్‌లలో గొప్పగా రాణించాడని కొనియాడారు. ప్రతి ఫార్మాట్‌కు తిలక్‌కు అవకాశాలు ఇవ్వడంతో మద్దతుగా నిలవాలని సలహా ఇచ్చాడు. హైదరాబాద్‌కు ఆడుతున్నప్పటి నుంచి తిలక్ వర్మ ఆటను చూస్తున్నానని వివరణ ఇచ్చారు. అతడు సూపర్ స్టార్ క్రికెటర్‌గా ఎదుగుతాడన్నారు. మూడో టి20 మ్యాచ్ జనవరి 28న రాజ్‌కోట్‌లో ఇంగ్లాండ్, భారత్ మధ్య జరుగనుంది. ఐదు టి20 సిరీస్‌లో మూడో మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News