హైదరాబాద్: అంబేడ్కర్ కేవలం ఒక జాతికి సంబంధించిన వ్యక్తి కాదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో డాబిఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన ఫొటోకు కెటిఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో ప్రసంగించారు. దళిత బంధు లాంటి దమ్మున పథకం పెట్టిన వ్యక్తి కెసిఆర్ అని కొనియాడారు. వందకి పైగా దేశాల్లో అంబేడ్కర్‌ను గుర్తు చేసుకుంటున్నారని, రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదంటే కొన్ని పార్టీల కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలని, ప్రజలంతా అంబేడ్కర్ ఆలోచనలు, ఆశయాల కోసం కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. అంబేడ్కర్ ఆశయాల దిశగా అందరం ముందుకు సాగుతామని వివరించారు. అంబేడ్కర్ స్ఫూర్తితోనే ప్రజా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని కెసిఆర్ చెప్పారని, స్వేచ్ఛ కంటే సమానత్వం ముఖ్యమని అంబేడ్కర్ చెప్పారని, విద్యతోనే వికాసం వస్తుందని, వికాసంతోనే ప్రగతి వస్తుందని, ప్రగతితోనే సమానత్వం వస్తుందనే అంబేడ్కర్ ఆలోచనతో 1022 గురుకులాలు ఏర్పాటు చేసుకున్నామని, ప్రపంచంలో అతి పెద్దదైన 125 అడుగుల బాబా సాహెబ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని వివరించారు. తాము ఏర్పాటు చేసింది విగ్రహం కాదని, విప్లపం ఆనాడే కెసిఆర్ చెప్పారని కెటిఆర్ గుర్తు చేశారు.
ప్రజలంతా అంబేడ్కర్ ఆలోచనలు, ఆశయాల కోసం కలిసి పని చేయాలి: కెటిఆర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -