Monday, January 20, 2025

అంబేద్కర్‌ రాజ్యాంగం అంటే ప్రజలకు ఓ ధైర్యం: జగ్గారెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌ గాంధీకి చాలా తేడా ఉందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తెలిపారు. దేవుడిని మొక్కినా రాహుల్‌ పబ్లిసిటీ చేసుకోరన్నారు. శుక్రవారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. బిజెపి వాళ్లు దేవుడిని మొక్కి పబ్లిసిటీ కోసం వెంపర్లాడుతారని దుయ్యబట్టారు. అంబేద్కర్‌ రాజ్యాంగం అంటే ప్రజలకు ఓ ధైర్యం అని, ప్రజలు ప్రశాంతంగా ఉన్నారంటే రాజ్యాంగ ఫలితమేనని స్పష్టం చేశారు. రాజ్యాంగం మార్చాలని బిజెపి ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. రాజ్యాంగ రక్షణకు రాహుల్ పోరాడుతున్నారని జగ్గారెడ్డి కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News