Sunday, December 22, 2024

ఆత్మ గౌర‌వానికి ప్ర‌తీక డా. బీఆర్. అంబేద్కర్

- Advertisement -
- Advertisement -

Ambedkar is symbol of self respect: Minister Indrakaran Reddy

హైదరాబాద్: స‌చివాల‌యానికి అందరివాడైనా అంబేడ్క‌ర్ పేరు పెట్ట‌డం మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణమని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. ప్ర‌జాస్వామిక ఔన్నత్యానికి ఒక సమున్నత ప్రతీకయైన‌ అంబేడ్కర్‌ ప‌ట్ల గౌర‌వాన్ని చాటుకుకున్న సీఎం కేసీఆర్ కు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ద‌న్య‌వాదాలు తెలిపారు. జాతి నిర్మాత డా. బీఆర్. అంబేద్కర్ భారత రాజ్యాంగంలో కల్పించిన ప్రజల హక్కుల వల్ల రిజర్వేషన్లు వలన ప్రతి ఒక్కరూ తల ఎత్తుకొని ధైర్యంగా, ఆత్మగౌరవంతో జీవించే అవకాశం కల్పించారని. అలాంటి మహానుభావుని పేరుని తెలంగాణ స‌చివాల‌యానికి నామ‌క‌ర‌ణం చేయ‌డం మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గొప్ప చరిత్ర కలిగిన వారిలో డా.బీఆర్‌.అంబేడ్కర్‌ ఒకరని, అలాంటి మ‌హనీయుడి పేరు స‌చివాల‌యానికి పెట్ట‌డం హ‌ర్షించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని తెలిపారు.

ప్ర‌జాస్వామిక ఔన్నత్యానికి ఒక సమున్నత ప్రతీకయైన జాతి నిర్మాత‌ అంబేడ్కర్ పేరు పెట్టి ఆయ‌న ప‌ట్ల త‌న‌కున్న గౌర‌వాన్ని సీఎం చాటుకున్నార‌ని తెలిపారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమన్న అంబేద్కర్‌ సిద్ధాంతం ప్రకారమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు స్వప్నం సాకారమైందన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ అంబేద్కర్ స్పూర్తితో ఆయన ఆశయాలను అమలు చేస్తూ నిజమైన అంబేద్కర్ వాదిగా అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సిఎం కృషి చేస్తున్నార‌ని పేర్కొన్నారు. మ‌రోవైపు కొత్త పార్లమెంట్ బిల్డింగ్​కు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని మంత్రి డిమాండ్ చేశారు. అంబేడ్క‌ర్ పై వారికి అభిమానం,గౌర‌వం ఉంటే ఈ ప్రాంత బీజేపీ నేత‌లు కేంద్రంపై అంబేడ్క‌ర్ పేరు పెట్టేలా కేంద్రాన్ని ఒప్పించాల‌న్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News