Wednesday, January 22, 2025

జ్ఞానానికి, మేధ‌స్సుకు సింబల్ అంబేడ్కర్: జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆలోచనలను అలుచేయడమే మనం ఆయనకు ఇచ్చే అసలైన నివాళి అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. నవ భారత రాజ్యాంగ నిర్మాత “భారతరత్న” బాబా సాహెబ్ డా బి ఆర్ అంబేడ్కర్ 132 వ జయంతి మహోత్సవ లో వేడుకలు సూర్యాపేట లో వైభవంగా జరిగాయి. ఖమ్మం క్రాస్ రోడ్స్ లో అంబేడ్కర్ కాంస్య విగ్రహానికి పూల మాల వేసి మంత్రి జగదీష్ రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… జ్ఞానానికి, మేధస్సుకు సింబల్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ అని కొనియాడారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే దేశానికి శ్రీరామ రక్ష అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తిని శాశ్వతంగా ఉంచడానికే సిఎం కెసిఆర్ తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడమే కాకుండా ఆ మహనీయుని 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని రాజధాని నడిబొడ్డున ఏర్పాటు చేయించారని తెలిపారు.

అంబేడ్కర్ స్ఫూర్తిని గుర్తించింది దేశం లో కెసిఆర్ మాత్రమే అని మంత్రి తెలిపారు. విద్య‌ను హక్కుగా పొందుపరచి దేశానికి వెలుగులు ఇచ్చిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. ఆర్ధిక‌, సామాజిక స‌మాన‌త్వం కోసం ఆయ‌న క‌ట్టుబ‌డి ఉన్న తీరు ప్ర‌జాస్వామ్యానికి వెన్నుముఖగా నిలుస్తుంద‌ని అన్నారు. అనంతరం ప్రభుత్వ రంగం లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు మంత్రి సత్కరించి, ప్రశంసా పత్రాలు అందజేశారు.

కార్యక్రమం లో అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గొపగానీ వెంకట్ నారాయణ గౌడ్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ అన్నపూర్ణమ్మ, రాష్ట్ర బిఆర్ ఇయర్ కార్యదర్శి వై. వి, చివ్వెంల ఎంపిపి కుమారి బాబు నాయక్, జడ్పిటిసి సంజీవ నాయక్, కౌన్సిలర్లు జ్యోతి శ్రీ విధ్య, భరత్ మహాజన్, వెంపటి గురూజీ, చిన శ్రీరాములు, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టు కొండ సత్య నారాయణ, మాజీ ఎమ్మెల్యే దోసాపటి గోపాల్ తదితరులు పాల్గొన్నారు..

రాజ్యాంగ నిర్మాత అందుకో జాతి నీరాజనం

బాబా సాహెబ్ జయంతి న రాజ్యాంగ నిర్మాత తో సెల్ఫీ తో మంత్రి జగదీష్ రెడ్డి నీరాజనం పలికారు  మొదట పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం తన మంత్రి పదవి రావడానికి కారకుడు అయిన రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ విగ్రహాన్ని తీక్షణంగా చూస్తూ ఉండి పోయారు.. సుమారు 45నిమిషాలకు పైగా అంబేడ్కర్ విగ్రహం వద్దే ఉన్న మంత్రి తన అభిమాన నేత కు సెల్ఫీలతో నీరాజనం పలికారు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News