Wednesday, January 22, 2025

అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు ఆహ్వానం రాలేదు: గవర్నర్ తమిళిసై

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం హుస్సేన్ సాగర్ తీరాన ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు ఆహ్వానంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ట్యాంక్ బండ్ వద్ద విగ్రహావిష్కరణకు ఆహ్వానం రాలేదని తమిళిసై తెలిపారు. విగ్రహావిష్కరణకు ఆహ్వానం వచ్చి ఉంటే వెళ్లేదాన్ని అని ఆమె పేర్కొన్నారు. అంబేడ్కర్ ఎక్కువగా మహిళల హక్కుల గురించి మాట్లాడారని.. మహిళా గవర్నర్ కు ఆహ్వానం రాకపోవడంతో ఆశ్చర్యంగా ఉందన్నారు. అందుకే రాజ్ భవన్ లోనే అంబేడ్కర్ కు నివాళులర్పించానని గవర్నర్ తమిళిసై వెల్లడించారు.విగ్రహావిష్కరణకు అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ ముఖ్య అథిదిగా హాజరైన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News