Thursday, January 23, 2025

అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ బి.ఎడ్ ఎంట్రన్స్ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయo బి.ఎడ్, బి.ఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్)
ప్రవేశ పరీక్ష – 2023 ఫలితాలు విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి డా. పరాంకుశం వెంకటరమణ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 6న తేదీన నిర్వహించిన బి.ఎడ్ పరీక్షకు 6834 విద్యార్థులు నమోదు చేసుకోగా అందులో 5761 విద్యార్థులు అర్హత సాధించారు. బి.ఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) 2267 విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా ప్రవేశ పరీక్షలో 1960 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ప్రవేశ పరీక్ష ఫలితాలు విశ్వవిద్యాలయo పోర్టల్ www.braouonline.inలో అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News