Saturday, December 21, 2024

అంబేద్కర్ సంఘ భవనాన్ని ప్రారంభించిన మంత్రి అల్లోల

- Advertisement -
- Advertisement -

నిర్మల్: నిర్మల్ పట్టణంలోని 36వ వార్డు బుధవార్‌పేట్‌లో నూతనంగా నిర్మించిన మాల సంఘం భవనాన్ని బుధవారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ…. సంఘ భవనంలో మొదటి అంతస్తుకు 12 లక్షల నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. గాజులపేట్ వద్ద ఉన్న మాల స్మశాన వాటిక అభివృద్ది పరుస్తామని హామీ ఇచ్చారు. ఈ వార్డులో పురాతన శివాలయంకు ప్రహారీ గోడ, ధ్వజస్తంభం, దేవాదాయశాఖ నిధులతో నిర్మించి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రభుత్వం ఈ సంవత్సరం నియోజకవర్గంలో 500 మందికి దళిత బంధు పథకం అమలు చేస్తోందని అర్హులైన పేదలందరికి బంధు పథకాన్ని వర్తింపజేస్తామని మంత్రి అల్లోల పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News