Monday, January 20, 2025

అంబేద్కర్ విగ్రహ రూపశిల్పికి మంత్రుల ఘన సన్మానం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన డా. బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ రూపశిల్పి మహారాష్ట్రకు చెందిన అనిల్ సుతార్ ను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనంగా సత్కరించారు. మెమొంటో అందజేసి శాలువాతో సన్మానించారు. ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 100 ఏళ్ల పైబడిన ప్రధాన శిల్పి రామ్ సుతార్ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు.

ఈ సందర్భంగా ఆర్ అండ్ బి ఈఎన్‌సి గణపతి రెడ్డి, ఈఈ రవీంద్ర మోహన్, ఆర్కిటెక్ట్ జయ్ కాక్టికర్, కెపిసి నిర్మాణ సంస్థ ప్రతినిధులు అనిల్ కుమార్, కొండల్ రెడ్డి, వంశీ వర్ధన్ రెడ్డి తదితరులను ప్రభుత్వం తరఫున మంత్రులు సన్మానించి అభినందనలు తెలిపారు. అర్ అండ్ బి శాఖ అధికారులు, కెపిసి నిర్మాణ సంస్థ ప్రతినిధులు కలిసి రాష్ట్ర మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ లను శాలువాతో సన్మానించారు. తమకు విలువైన సూచనలు చేస్తూ అందరినీ సమన్వయం చేస్తూ అన్ని విధాల తోడ్పాటు, మనోధైర్యాన్ని ఇచ్చిన మంత్రులకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News