Sunday, February 23, 2025

Ambedkar: పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్‌ విగ్రహ ఆవిష్కరణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని పంజాగుట్ట (Punjagutta) చౌరస్తాలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) అనుమతినిచ్చింది. ఏప్రిల్ 14వ తేదీన బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పంజాగుట్టలో విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. విగ్రహ పనులను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రజల మనోభావాలను అనుగుణంగా విగ్రహం ఏర్పాటు చేస్తునన్నట్లు ఎమ్మెల్యే దానం పేర్కొన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నామని దానం వెల్లడించారు. విగ్రహ ఏర్పాటుకు సంబంధించి చాలా ఏళ్లుగా డిమాండ్‌ ఉందని, దీనిపట్ల మంత్రి కెటిఆర్‌ (Minister KTR) సానుకూలంగా స్పందించారని ఆయన పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News