Friday, December 20, 2024

‘జై’ భీమ్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ బాంధవుడు, అందరివాడు అంబేద్కర్
రాజ్యాంగ ప్రదాతకు సమున్నత నివాళి సచివాలయం
సముదాయంలో దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్
విగ్రహం పాలన వ్యవస్థకు నిత్య చైతన్య స్ఫూర్తి
14 ఆవిష్కరణ సభకు భారీ సన్నాహాలు విగ్రహ
రూపశిల్పి 98 ఏళ్ల పద్మభూషణ్ రామ్ వంజి సుతార్‌కు
ప్రత్యేక సన్మానం భవిష్యత్ తరాలకు స్ఫూర్తి ఇవ్వడమే
కోసమే ఈ భారీ నిర్మాణం సమీక్ష సమావేశంలో సిఎం

కన్నుల పండువగా చరిత్రాత్మక వేడుక

ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో అంబేద్కర్ విగ్రహా విష్కరణకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటి వివరాలు ఇలా…

ఈ నెల 14న జరిగే అంబేద్కర్ విగ్రహావిష్కరణను అత్యంత వైభవోపేతంగా, చారిత్రాత్మక వేడుకగా,కన్నుల పండుగగా దేశం గర్వించే రీతిలో జరపాలి.

ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పూల జల్లు కురిపిస్తూ భారత రత్న, భారత రాజ్యాంగ నిర్మాత తెలంగాణ ప్రదాత కు ఘనమైన రీతిలో పుష్పాంజలి ఘటించాలి.

గులాబీలు, తెల్ల చామంతి, తమలపాకులతో అల్లిన భారీ పూలమాలను రూపొందించాలి.
125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికున్న భారీ పరదాను తొలగించడానికి, నిలువెత్తు పూలమాలను అలంకరించడానికి….అతి పెద్ద క్రేన్ ను ఉపయోగించాలి.

ఈ కార్యక్రమానికి బౌద్ధ భిక్షువులను మాత్రమే ఆహ్వానించి వారి సాంప్రదాయ పద్దతిలోనే కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఈ కార్యక్రమానికి.. సచివాలయ సిబ్బంది అధికారులతో పాటుఅన్ని శాఖల హెచ్‌ఒడిలు, జిల్లా కలెక్టర్లు..రాష్ట్ర మంత్రులు, ఎంపీలు (రాజ్యసభ, లోక్ సభ) , ఎంఎల్‌సిలు, ఎంఎల్‌ఎలు,రాష్ట్ర కార్పోరేషన్ చైర్మన్లు ఆహ్వానించాలని నిర్ణయించారు.

ప్రతి నియోజకవర్గం నుంచి 300 మంది చొప్పున మొత్తం 119 నియోజకవర్గాల నుంచి 35,700 మంది అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలి.

ప్రజల తరలింపు కోసం 750 ఆర్‌టిసి బస్సులను బుక్ చేసుకోవాలి.

హైదరాబాద్ చేరుకునే లోపే 50 కిలోమీటర్ల దూరంలోనే సభ కు వచ్చిన ప్రజలకు భోజనం ఏర్పాట్లను చూసుకోవాలి. సభానంతరం తిరిగి వెల్లేటప్పుడు

మన తెలంగాణ/హైదరాబాద్ :భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశయుడు కనబరిచిన దార్శనికతతోనే దళిత గిరిజన బహుజన వర్గాలతో పాటు సకల జనులందరికీ ఆర్థిక,సామాజిక న్యాయం, అన్ని రంగాల్లో సమాన న్యాయం అమల్లోకి వచ్చిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. దీనికోసం తన జీవితాన్నే త్యాగం చేసిన ప్రపంచం గర్వించదగ్గ మేధావి అంబేద్కర్ అని కొనియాడారు. తన దూరదృష్టితో అనేక చర్చల అనంతరం, ప్రత్యేక రాష్ట్రాల కోసం, ఆర్టికల్ 3 ని రాజ్యాంగంలో ప్రత్యేక శ్రద్ధతో రూపొందించి పొందుపరిచారని సిఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాకారం కావడానికి మార్గం సుగమం చేసిన తెలంగాణ బాంధవుడు, అందరివాడు బిఆర్ అంబేద్కర్ అని ఆయన స్పష్టం చేశారు. పక్కనే సచివాలయం, ఆ ఎదురుగా తన ఆరాధ్యుడు బుద్ధుని విగ్రహం, మరోదిక్కు త్యాగాలు చేసిన అమర వీరుల స్మారక స్థూపం..వీటి నడుమ శిఖరమంత ఎత్తున నిలిచిన అంబేద్కర్ మహానుభావుడు మనలను నిత్యం చైతన్యపరుస్తూ పాలక వ్యవస్థకు నిత్య స్పూర్తివంతమై దారి చూపుతాడని సిఎం పేర్కొన్నారు. 125 అడుగుల ఎత్తులో నిర్మించిన అంబేద్కర్ మహా విగ్రహాన్ని, శోభాయమానంగా.. తెలంగాణ సమాజంతో పాటు యావత్ దేశ ప్రజలు సంబురపడేలా గొప్పగా ఆవిష్కరించుకుందామని సిఎం కేసీఆర్ అన్నారు.

దేశం గర్వించదగ్గ స్థాయిలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్న సందర్భంలో ఆవిష్కరణ సభ కూడా అంతే ఉన్నత స్థాయిలో,అంబేద్కర్ ఔన్నత్యాన్ని మరింత గొప్పగా ప్రపంచానికి చాటి చెప్పేలా ఉండాలని సిఎం కెసిఆర్ మంత్రులకు, అధికారులకు స్పష్టం చేశారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ పుట్టిన రోజు సందర్భంగా జరుపతలపెట్టిన విగ్రహావిష్కరణ కార్యక్రమం.. అనంతరం నిర్వహించే బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు తదితర అంశాలపై మంగళవారం ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంఎల్‌సిలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య, రసమయి బాలకిషన్, బాల్క సుమన్, విఠల్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, జిహెచ్‌ఎంసి కమిషనర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డిజిపి అంజని కుమార్, హైద్రాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, సిఎం ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావు, సిఎంఒ కార్యదర్శులు భూపాల్ రెడ్డి, స్మితాసబర్వాల్, ఫైనాన్స్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, హెచ్‌ఎండిఎ కార్యదర్శి అరవింద్ కుమార్, సంక్షేమ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, ఇఎన్‌సి గణపతి రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, అంబేద్కర్ విగ్రహం స్థాపించాలని నిర్ణయం తీసుకున్న నాటినుంచి, కలకాలం నిలిచే విధంగా సాంకేతికంగా, తయారీ పరంగా పకడ్బందీ చర్యలు తీసుకోవడాని కనీసం రెండు సంవత్సరాల సమయం తీసుకున్నదన్నారు. ఇందుకు పలు దేశాలు ప్రాంతాలు తిరిగి సమాచారాన్ని సేకరించి పూర్తి స్వదేశీ పరిజ్జానంతోనే రూపొందించడం తనకు అత్యంత సంతృప్తిని కలిగించిందన్నారు. ‘నేను ఊంచినదానికంటే అత్యద్భుతంగా విగ్రహం రూపం ఆవిష్కృతమైంది. ప్రసన్నవదనంతో నిలుచుని ఉన్న అంబేద్కరుడు ఒక తాత్విక జ్జానిగా అలరిస్తున్నాడు” అని సిఎం కెసిఆర్ తన ఆనందాన్ని, సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విగ్రహ రూపశిల్పి.. 98 ఏండ్ల పద్మభూషణ్, రామ్ వంజీ సుతార్‌కృషిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించాలని నిర్ణయించారు.

భవిష్యత్‌తరాల వారికి స్పూర్త్తినివ్వడం కోసం

దేశం గర్వించదగ ్గరీతిలో అంబేద్కర్ మహాశయుని మహా విగ్రహాన్ని త్వరలో ఆవిష్కరించుకోబోతున్నామని సిఎం అన్నారు. ఈ దేశం ప్రజల కోసం భవిష్యత్తు తరాల కోసం రాజ్యాంగ నిర్మాతగా సామాజిక న్యాయం కోసం పోరాడిన యోధునిగా వారు చేసిన కృషి, త్యాగం అజరామరమమని అన్నారు. ఆయన స్పూర్తిని భవిష్యత్ తరాల వారికి అందించాలన్న లక్షంతోనే విగ్రహాన్ని అత్యంత భారీగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేవలం దళితులు,గిరిజనులు బహుజనులు, భారతదేశ ప్రజలు మాత్రమే కాదు…వివక్షను ఎదుర్కునే ప్రతి చోటా అంబేద్కర్ ఆశయం సాక్షాత్కారమవుతుందన్నారు. అంబేద్కర్ మహాశయుడు విశ్వ మానవుడు. వారి కృషి ఒక్కటని చెప్పలేమన్నారు. వారికి మనం ఎంత చేసుకున్నా తక్కువే. అత్యున్నత స్థాయిలో వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే వారి అత్యున్నత ఆశయాలను అనుసరించేందుకు నిత్యం స్పూర్తి పొందడమేనని అని సిఎం అన్నారు.

తగు జాగ్రత్తలు… పకడ్బంది ఏర్పాట్లు జరగాలి

అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రజా ప్రతినిధులు, యావత్ ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలనే గొప్ప సంకల్పంతోనే.. రాష్ట్ర సచివాలయానికి వారి పేరు పెట్టుకున్నామని సిఎం కెసిఆర్ అన్నారు. ఇటువంటి చారిత్రాత్మక సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని తగు జాగ్రత్తలతో పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్రం నలు మూలల నుంచి విగ్రహావిష్కరణ కోసం వచ్చే అతిథులు, ప్రజల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అని మంత్రులకు, ఉన్నతాధికారులకు సిఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన వారికి పలు సూచనలు చేశారు.

మరో నెల రోజుల పాటు ఏర్పాట్లు కొనసాగించాలి

అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగిన తర్వాత, రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా అంబేద్కర్ అభిమానులు, సామాజిక వేత్తలు సామాన్యులు ఆయన సందర్శన కోసం వస్తారని సిఎం కెసిఆర్ అన్నారు. అందువల్ల వారు ఆయనకు నివాళులర్పించేందుకు విగ్రహ ప్రాంగణంలో పలు రకాల పుష్పాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఎండాకాలం కావడంతో నీడకోసం టెంట్లు ఏర్పాటు చేయాలని, తాగునీల్లు, మజ్జిగ తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ ఏర్పాట్లు అన్ని మరో నెల రోజుల పాటు కొనసాగించాలని మంత్రులను, అధికారులను సూచించారు.

సెంటర్ ఫర్ సబాల్టర్న్‌ను నేనే ఏర్పాటు చేశా
4 దశాబ్దాల క్రితమే శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే భారత దేశ దళితుల స్థితిగతులను, ప్రపంచంలోని అణగారిన వర్గాల తో పాటు పోల్చేతూ అధ్యయనం చేయాలనే తలంపుతో ‘సెంటర్ ఫర్ సబాల్టర్న్ స్టడీస్ ’ అనే అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా భారత దేశంలో అంటరాని తనం పేరుతో దుర్మార్గమైన రీతిలో వివక్షకు గురవుతున్న దళితుల అభ్యున్నతికోసం, వారితో పాటు అన్ని వర్గాల ప్రజల హక్కుల కోసం అంబేద్కర్ మహాశయుడు పడిన శ్రమ కృషి ఆసియా ఖంఢంలోనే మరొకరు చేయలేదని సిఎం స్పష్టం చేశారు.

విగ్రహం..
విశిష్టతలు

2016 ఏప్రిల్ 14న శంకుస్థాపన
ఎత్తు 125 అడుగులు, దేశంలోనే
అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహం
బేస్‌మెంట్ ఎత్తు 50 అడుగులు
వెడల్పు 45.5 అడుగులు
వినియోగించిన స్టీల్ 791 టన్నులు,
ఇత్తడి 96 మెట్రిక్ టన్నులు
మొత్తం వ్యయం రూ.146 కోట్లు
పని చేసిన శ్రామికులు 425 మంది
2 ఎకరాల విస్తీర్ణంలో విగ్రహ నిర్మాణం
విగ్రహ రూపశిల్పి పద్మభూషణ్
రామ్ వంజి సుతార్
36 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతివనం
అంబేద్కర్ స్మృతివనంలో రాక్ గార్డెన్,
ల్యాండ్ స్కేపింగ్, ప్లాంటేషన్, మెయిన్
ఎంట్రెన్స్, వాటర్ ఫౌంటేన్‌చ, సాండ్ స్టోన్
వర్క్, జిఆర్‌సి, గ్రానైట్ ఫ్లోరింగ్, లిఫ్ట్
విగ్రహానికి చేరుకోడానికి
మెట్ల దారి, ర్యాంప్
బిల్డింగ్ లోపల
ఆడియో విజువల్
రూమ్, ఫాల్స్
సీలింగ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News