హైదరాబాద్: నగరంలో కాసేపట్లో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 360 మెట్రిక్ టన్నుల ఉక్కు, 114 టన్నుల కాంస్యంతో విగ్రహం తయారు చేశారు. విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ హజరుకానున్నారు.
Also Read: Ambedkar: అంబేడ్కర్ విగ్రహావిష్కరణ…. ట్రాఫిక్ ఆంక్షలు
ఇప్పటికే నెక్లెస్ రోడ్డుకు పలువురు ప్రజాప్రతినిధులు చేరుకున్నారు. బౌద్ధ గురువుల ప్రార్థనల మధ్య అంబేడ్కర్ విగ్రహావిష్కరణ చేయనున్నారు. కార్యక్రమానికి ఉన్నతాధికారులు, కలెక్టర్లు హాజరవుతున్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు వచ్చేలా 750 బస్సులు ఏర్పాటు చేశారు. నియోజకవర్గానికి 300 చొప్పున జనసమీకరణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. విగ్రహావిష్కరణ తర్వాత బహిరంగసభకు లక్ష మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు బిఆర్ఎస్ నేతలు.