Monday, January 20, 2025

అంబేద్కర్ వర్షిటీ డిగ్రీ, పీజీ కోర్సులో ప్రవేశ గడువు పెంపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీ.జీ కోర్సులు, బిఎల్‌ఐఎస్, ఎంఎల్‌ఐఎస్‌సి, పీ.జీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో చేరడానికి చివరి తేది సెప్టెంబర్ 5 వరకు పొడిగించినట్లు విద్యార్థి సేవల విభాగ డైరెక్టర్ డా. ఎల్‌వికె రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.

ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాలని www.braouonline.in లో పొందుపర్చినట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయ టోల్‌ఫ్రీ నెం 18005990101, హెల్ప్ డెస్క్ నంబర్లు 7382929570/580, 040-23680222/333/555 లో సంప్రదించాలని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News