Thursday, January 23, 2025

జూలై 3వ తేదీ నుండి అంబేద్కర్ వర్షిటీ పీజీ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః డా.బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పీజీ పరీక్షలు జూలై 3వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి డా.పి. వెంకటరమణ తెలిపారు. శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఎకనామిక్స్, చరిత్ర, పొలిటికల్ సైన్సు, పబ్లిక్ ఆడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఇంగ్లీషు, తెలుగు, హిందీ, ఉర్దూ, మాస్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్, ఎంకాం ఎంఎస్సీ( మ్యాథమాటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఎన్విరాన్ మెంటల్ సైన్సు, సైకాలజీ, ఎంబీఏ, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్పర్మేషన్ సైన్సు, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్పర్మేషన్ సైన్సు, అన్ని డిప్లొమాలు, సర్టిఫికేట్ కోర్సుల పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

మొదటి సంవత్సరం పరీక్షలు జూలై 10 నుంచి ప్రారంభమైతాయని పేర్కొన్నారు. పరీక్షకు హాజరై విద్యార్థులు విశ్వవిద్యాలయం పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. అనంతరం ఫీజును టిఎస్.ఏపి అన్‌లైన్ సెంటర్ల ద్వారా డెబిట్, క్రెడిట్ కార్డుతో మాత్రమే చెల్లించాలి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ జూన్ 2 వరకు ఉందన్నారు. పరీక్షల ప్రారంభానికి రెండు రోజుల ముందు విశ్వవిద్యాలయ పోర్టల్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. వివరాల కోసం అభ్యర్థులు వారి సంబంధిత అధ్యయన కేంద్రంలో కానీ విశ్వవిద్యాలయం కాల్ సెంటర్ 18005990101, హెల్ప్ డెస్క్ 7382929570 పోన్ నెంబర్లు సంప్రదించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News