Wednesday, January 22, 2025

నూతన సెక్రటేరియట్ కు అంబేడ్కర్ పేరు: సబితా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహనీయుని ఆశయ సాధనలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక తెలంగాణ నూతన సెక్రటేరియట్ కు అంబేడ్కర్ పేరు పెట్టడంతో పాటు అతి పెద్ద విగ్రహం ఏర్పాటు చేశారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాజ్యాంగాన్ని రచించి దేశానికి దశ దిశ నిర్దేశం చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన విధంగా ప్రతి ఒక్కరు ఆర్థిక,సామాజిక రంగాల్లో సమానంగా ఎదగాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు దళిత బంధు, గిరిజన బంధు లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని ప్రశంసించారు.

మహేశ్వరం నియోజకవర్గం లోని సరూర్ నగర్ డివిజన్ అంబేద్కర్ కాలనీలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జిల్లెల కృష్ణారెడ్డి, మాజీ కార్పొరేటర్ అనిత దయాకర్ రెడ్డి, సరూర్ నగర్ డివిజన్ టి ఆర్ ఎస్ అధ్యక్షులు మహేందర్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బేర బాలకృష్ణ, ధర్పల్లి అశోక్, అంకిరెడ్డి, గౌని శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News