Sunday, January 19, 2025

ప్రతి ఒకరు స్వేచ్చగా బతికే హక్కును కల్పించిన మహానీయుడు అంబేద్కర్

- Advertisement -
- Advertisement -
తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్‌సాగర్

హైదరాబాద్ :  ప్రతి ఒక్కరు స్వేచ్చగా బతికే హక్కును రాజ్యాంగంతో కల్పించిన వ్యక్తి అంబేద్కర్ అని, ఆయన జన్మస్థలం వీక్షించడం తన అదృష్టమని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ తెలిపారు. ఆదివారం మధ్యప్రదేశ్ లోని మహులో గల డాక్టర్ అంబేద్కర్ జన్మస్ధలాన్ని అధికారుల బృందంతో కలిసి ఆయన సందర్శించారు. మెమోరియల్ ట్రస్ట్‌లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళుల్పరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇండోర్‌కు 35 కిలో మీటర్ల దూరంలో ఉన్న మహు ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దడం ఆనందంగా ఉందన్నారు. అంబేద్కర్ ఆశయాలకు, ఆలోచనలకు అనుగుణంగానే సిఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించేందుకు రావాలని మహులోని అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ రాజేష్ వాంఖడేను ఆహ్వానించారు. దాదాపు 100 మంది సభ్యులతో త్వరలోనే సందర్శనకు వస్తామని రాజేష్ వాంఖడే హామీ ఇచ్చారు. మధ్యప్రదేశ్ బీఆర్‌ఎస్ నేత డా. ఆనంద్ రాయ్, ఫుడ్స్ అధికారుల బృందం ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News