Tuesday, December 24, 2024

అంబేద్కర్ సంఘ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్ ప్రతినిధి : రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు కొనసాగుతున్నా వేళ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన అంబేద్కర్ భవన నిర్మాణాన్ని ప్రారంభించుకోవడం ఉంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలో రెండు కోట్ల రూపాయిల వ్యయంతో నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్‌ను శనివారం మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేంధర్‌తో కలిసి ఎమ్మెల్యే లంఛనంగా ప్రారంభించారు. ముందుగా శిలా ఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించారు. అంబేద్కర్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళ్లర్పించారు. అదే విధంగా ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్మన్‌ను దళిత సంఘాల నేతలు శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధ్దే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్నా గిరిజన దినోత్సవం రోజున అంబేద్కర్ భవన్‌ను ప్రారంభించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌సిడిడబ్లు సునీత కుమారి, అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ దుర్గం శేఖర్, నాయకులు రాం కుమార్, రత్నాజాడే, ప్రజ్ఞ కుమార్, పట్టణ అధ్యక్షులు అజయ్, మనోజ్, రాందాస్, రాజన్న, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News