హసన్‌పర్తి: ప్రపంచ మేధావి అంబేద్కర్ అని, న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా, సంఘ సంస్కర్తగా విభిన్న మహానాయకుడు అంబేద్కర్ అని బీఆర్‌ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 65వ డివిజన్ దేవన్నపేటలో ఏర్పాటుచేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆరూరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచనా విధానం నేటి తరానికి ఆదర్శప్రాయమన్నారు. బాల్యం నుంచి వివక్షను ఎదుర్కొంటూ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో అస్పృశ్యతను రూపుమాపి మానవ సమాజాన్ని సమైక్యం చేయడంలో కీలక పాత్ర పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో 65వ డివిజన్ కార్పొరేటర్ గుగులోతు దివ్యరాణి రాజునాయక్, మాజీ డివిజన్ అధ్యక్షుడు భూపాల్‌గౌడ్, గ్రామాధ్యక్షుడు రాజు(మైకేల్), పీఏసీఎస్ డైరెక్టర్ విజయేందర్, మాజీ సర్పంచ్ రవి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు సూరం వాసుదేవరెడ్డి, పుట్ట రవి, పుట్ట బిక్షపతి, డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేకల సుదన్, డివిజన్ ప్రధాన కార్యదర్శి పుట్ట శంకర్ తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ ఆలోచనా విధానం నేటి తరానికి ఆదర్శప్రాయం
- Advertisement -
- Advertisement -
- Advertisement -