Monday, September 23, 2024

తిరుపతి లడ్డూలో అంబర్ ప్యాకెట్

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: తిరుమల తిరుపతి లడ్డూలో అంబర్ ప్యాకెట్ కనిపించిన సంఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. భక్తురాలు తెలిపిన వివరాల ప్రకారం… గొల్లగూడె గ్రామానికి చెందిన దొంతు పద్మావతి గత గురువారం తిరుపతికి వెళ్లింది. బంధువులు, ఇరుగుపొరుగు వారి ప్రసాదం పంచేందుకు లడ్డూలు కొనుగోలు చేసింది. ఇంటికి వచ్చిన తరువాత ప్రసాదం పంచుతుండగా లడ్డూలో అంబర్ ప్యాకెట్ కనిపించడంతో అవాక్కైంది. శ్రీవారి లడ్డూలో అంబర్ ప్యాకెట్ కనిపించిందని స్థానిక మీడియా ప్రతినిధులకు తెలిపింది. లడ్డూలో నాసిరకంగా తయారు చేస్తున్నారని టిటిడిపై భక్తులు మండిపడుతున్నారు. వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కూడా కల్తీ జరగడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ జరగడంతో దేశవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తులు ఆందోళన చేస్తున్నారు. శ్రీవారి లడ్డూలో పాలకు బదులు ఇతర జంతువుల కొవ్వులు కలిసినట్టు గుజరాత్ రాష్ట్రానికి చెందని నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు అనుమానం వ్యక్తం చేసింది. తిరుమలలో లడ్డూలలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప కొవ్వు కలిసినట్టు అనవాళ్లు ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమైన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News