Monday, December 23, 2024

అంబర్‌పేట ఇన్స్‌స్పెక్టర్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, హైదరాబాద్ : భూమి ఇప్పిస్తానని చెప్పి ఎన్‌ఆర్‌ఐ నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసిన కేసులో అంబర్‌పేట్ ఇన్స్‌స్పెక్టర్‌ను వనస్థలిపురం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…అంబర్‌పేట ఇన్స్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సుధాకర్ కందుకూరు మండల పరిధిలో ఉన్న భూమిని రూ.54లక్షలకు ఇప్పిస్తానని చెప్పాడు. తక్కువ ధరకు భూమి వస్తోందని నమ్మిన ఎన్‌ఆర్‌ఐ పలు దఫాలుగా ఇన్స్‌స్పెక్టర్ సుధాకర్ బ్యాంక్ ఖాతాకు రూ.54లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశాడు.

ఈ క్రమంలోనే సస్పెండ్ అయిన ఆర్‌ఐ రాజేష్‌ను ఎన్‌ఆర్‌ఐకి పరిచయం చేశాడు. ఇతడే భూమిని రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాడని చెప్పాడు. అయితే డబ్బులు మొత్తం ఇచ్చి చాలా రోజులు అవుతున్నా కూడా ఇద్దరు భూమిని రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వకపోవడంతో తాను మోసపోయానని గ్రహించాడు. వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి ఇన్స్‌స్పెక్టర్ సుధాకర్, రాజేష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వనస్థలిపురం ఇన్స్‌స్పెక్టర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News