Thursday, December 26, 2024

ఉగ్రవాదుల మృతదేహాలతో వెళుతున్న అంబులెన్స్‌కు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

ఉత్తర ప్రదేశ్‌లోని పిలిభిత్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన ముగ్గురు ‘ఖలిస్థాన్ జిందాబాద్ ఫోర్స్’ (కెజడ్‌ఎఫ్) ఉగ్రవాదులను పంజాబ్‌కు తీసుకువెళుతున్న అంబులెన్స్‌ను మంగళవారం రాత్రి పొద్దుపోయిన తరువాత గుర్తు తెలియని వాహనం ఢీకొన్నది. రాంపూర్ బైపాస్‌పై జరిగిన ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి అపాయమూ జరగలేదని, కానీ అంబులెన్స్ మాత్రం ధ్వంసమైందని పోలీసులు తెలియజేశారు. మృతదేహాలన మరొక వాహనంలో తరలించినట్లు వారు తెలిపారు.

రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న రాంపూర్ పోలీసులు ఉగ్రవాదుల మృతదేహాలను మరొక అంబులెన్స్‌లోకి మార్చి పంజాబ్‌కు తరలించారు. గురుదాస్‌పూర్‌లోని పోలీస్ ఔట్‌పోస్ట్‌పై దాడి చేసిన ఖలిస్థానీ ఉగ్రవాదులు సోమవారం ఉత్తర ప్రదేశ్ పిలిభిత్ జిల్లాలోని పురానాపూర్‌లో పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటనా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News