Monday, March 31, 2025

అమీర్ పేటలో కారు బీభత్సం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా మందుబాబులు మాత్రం మారడం లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తున్న మందుబాబుల్లో మాత్రం మార్పు రావడంలేదు. హైదరాబాద్ లోని అమీర్ పేట ప్రాంతం ఎస్ ఆర్ నగర్ లో కారు బీభత్సం సృష్టించింది. బైక్ పై వెళ్తున్న ఇద్దరిని బలంగా ఢీకొట్టడంతో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. స్థానికులు వెంబడించి కారును ఆపి పోలీసులకు అప్పగించారు. కారులో ఉన్న వారు మద్యం మత్తులో ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News