Saturday, November 16, 2024

సభకు సవరణ బిల్లులు?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రానున్న అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ఆమోదింప చేసుకోవాలని రాష్ట్ర ప్రభు త్వం యోచిస్తోంది. ఆ దిశగా ప్రభుత్వం తగు కసత్తును కూడా మొదలుపెట్టింది. అసెంబ్లీ ఎన్నికలకు పది నెలల గడువు మాత్రమే ఉండడంతో ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్న ప లు అంశాలను యుద్ధప్రాతిపదికను పరిష్కరించాలని తలపెట్టింది. ఇందులో భాగంగానే డి సెంబర్ నెలలో వారం రోజుల పాటు జరగను న్న అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యమైన బి ల్లులను సభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనుందని తెలుస్తోంది. వాటిల్లో ప్రధానంగా అసైన్డ్ భూముల చట్ట సవరణకు సంబంధించిన బిల్లు ను కూడా అవకాశముందని ప్రభుత్వ వ ర్గాల్లో వినిపిస్తోంది. అలాగే గత అసెంబ్లీ సమావేశాలలో పలు బిల్లులకు ఆమోదం తెలిపినప్పటికీ గవర్నర్ నుంచి క్లీయరెన్స్ రాలేదు. దాంతో బిల్లుల ఆమోదం కోసం ప్రభుత్వం నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి కే న్యాయశాఖ నుంచి సలహాలు, సూచనలు తీ సుకుంటున్నది.

ఈ నేపథ్యంలో వారం రోజుల పాటు జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో కేం ద్రం నుంచి రావాల్సిన నిధులు, ఎంఆర్‌బిఎం నిబంధనలు పాటించినా కేంద్రం నుంచి తగు సహకారం లేకపోవడం, ఫలితంగా రాష్ట్రానికి రూ.40వేల కోట్ల ఆదాయం తగ్గడం వంటి అం శాలను ప్రస్తావిస్తూ కేంద్రం అనుసరిస్తున్న విధానాలను రాష్ట్ర ప్రజలకు వివరించనున్నారు. అలాగే అసైన్డ్ భూముల సమస్య వీడని చిక్కుముడిగా రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఈ అంశంపై ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై సిఎం కెసిఆర్ గత కొంత కాలంగా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కొనసాగుతున్న 1977 నాటి చట్టానికి పలు సవరణలు చేయనుందని తెలుస్తోంది. 2023 చివరలో జరిగే ఎన్నికలకు ముందుగానే ఈ క్రమబద్దీకరణ పథకాన్ని అమలులోకి తీసుకురావాలనే సిఎం కెసిఆర్ ఆలోచన చేస్తున్నారని ప్రభుత్వ వర్గాల్లోనూ ప్రచారం సాగుతోంది.

దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత, ఇతర పేద వర్గాల ఓట్లను గంపగుత్తగా తమ ఖాతాలో వేసుకోవాలన్న యోచనలో కెసిఆర్ ఉన్నారు. ఈ మేరకు అధికారులు చట్ట సవరణకు ఉన్న అవకాశాలను నిషితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే చట్టం ఆమోదం జరిగిన వెంటనే అమలులోకి తీసుకురావడానికి వీలుగా మార్గదర్శకాలు కూడ రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో దాదాపు 24 లక్షల ఎకరాల అసైన్డ్ భూములున్నాయి. దళితులకు ఇచ్చిన భూములు తిరిగి భూస్వాముల పాలు కాకుండా ఉండడం కోసం ఈ చట్టాన్ని అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చింది. ఎంతో మంచి ఆశయంతో తీసుకొచ్చిన ఈ పథకానికి ప్రారంభంలోనూ తూట్లు పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూములను వివిధ అవసరాల కోసం విక్రయాలు చేశారు. అలాంటి భూములు దాదాపు ఆరేడు లక్షల ఎకరాల వరకు అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా ధరణిలో అనేక అసైన్డ్ భూములకు సంబంధించిన వివరాలు సమగ్రంగా అందలేదు.

ఇక అసైన్డ్ భూములకు చెందిన రైతులకు ప్రభుత్వ పథకాలు అందడం లేదు. ఇదిలా ఉండగా ధరణి చట్టం అమలులోకి వచ్చిన తరువాత సదరు భూములు ఏవిధంగాను క్రయవిక్రయాలు చేయలేని పరిస్థితి కూడ ఏర్పడింది. అయితే ధరణికి ముందుగానే అనేక భూములు వివిధ కారణాలతో చేతులు మారాయి. కానీ పట్టా మారలేదు. దళితులు, బిసిలు, ఇతర పేద ప్రజలకు పలు సమయాలలో ప్రభుత్వం అసైన్ చేసిన భూములను వివిధ అవసరాల కోసం విక్రయించారు. అనేక అసైన్డ్ భూములు అన్యాక్రాంతం కూడా అయ్యాయి. ముఖ్యంగా నగరాల పక్కన ఉండే భూముల విలువ ఎప్పటికప్పుడు బాగా పెరిగింది. దీంతో రియల్ వ్యాపారులు కూడ పెద్ద ఎత్తున అసైన్డ్ భూములు అతి తక్కువ ధరకు తీసుకున్నారు. ఇలా అనేక భూములు చేతులు మారాయి. ఇలాంటి స్థితి పోవాలంటే అసైన్డ్ భూములకు పట్టా ఇచ్చి పూర్తి హక్కులు ఇవ్వాలన్న డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. ఈ మేరకు అసైన్ భూములను క్రమబద్దీకరించాలన్న నిర్ణయానికి సిఎం కెసిఆర్ వచ్చారని తెలుస్తోంది.

ఈ విషయాన్ని ఆయన గత సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అసైన్డ్ భూముల సమస్యపై ఆయన మాట్లాడారు. ఈ భూములు ఉన్న వారికి పూర్తి హక్కులు కల్పించాలన్నారు. అవసరమైతే చట్టంలో మార్పులు తీసుకువద్దామని తెలిపారు. ఈ మేరకు అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేస్తానని కెసిఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అసైన్డ్ భూముల క్రమబద్దీకరణ అంశంపై దళిత వర్గాలకు చెందిన శాసనసభ్యులతో త్వరలోనే కెసిఆర్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి తగు సూచనలు, సలహాలు తీసుకోనున్నారు. తదనుగుణంగా చట్టానికి పలు సవరణలు చేసి సమస్యను శాశ్వతంగా పరిష్కరించనున్నారు.

ఇక గత అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం పొందిన ఏడు బిల్లుల్లో ములుగు అటవీ కళాశాల పేరును తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయంగా మార్చడం, రాష్ట్ర విశ్వ విద్యాలయాల్లోని కొలువుల భర్తీకి ఉమ్మడి బోర్డు ఏర్పాటు, ప్రైవేటు వర్సిటీల చట్టం, పురపాలికల చట్టం, అజామాబాద్ పారిశ్రామిక ప్రాంత చట్టం, పబ్లిక్ ఎంప్లాయ్ మెంట్ చట్టం, మోటార్ వాహనాలపై పన్నులకు సంబంధించిన చట్టం సవరణ బిల్లులు ఉన్నాయి. ప్రస్తుతం ఇవి గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉండడంతో ఈ బిల్లులను అసెంబ్లీలో మరోసారి చర్చించాలా? లేకుంటే కొత్త బిల్లులు ప్రవేశపెట్టాలనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

సిఎంతో మంత్రులు భేటీ

అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై సిఎం కెసిఆర్‌తో ప్రగతి భవన్‌లో శుక్రవారం మంత్రులు హరీశ్, ప్రశాంత్‌రెడ్డిలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులపై సమగ్ర వివరాలతో కూడిన ఒక నివేదికను కెసిఆర్‌కు అందజేశారు. దీనిపై రెండు,మూడు రోజుల పాటు కూలంకషంగా చర్చించారు. తదనంతరం అసెంబ్లీ సమావేశాల్లో కేంద్రం చేసిన మోసాలు, కుట్రలు, కుతంత్రాలను కెసిఆర్ సభకు సమగ్రంగా వివరించనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News