Friday, December 20, 2024

పకడ్బందీగా ఓటరు జాబితా సవరణ

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: జిల్లాలో 2వ ప్రత్యేక ఓటరు జాబితా సవరణను ఎలాంటి పొరపాట్లు లేకుండా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. సోమవారం తహసిల్దార్లతో ఏర్పాటు చేసిన ఓటర్ల సవరణ కా ర్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అక్టోబర్ 1 వరకు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు తమ వివరాలు నమోదు చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

జూన్ 23 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించి, కొత్త ఓటర్లు, చనిపోయిన, ఇతర ప్రాంతా లకు వలస వెళ్లిన వారి ఓట్ల తొలగింపు చేట్టాలన్నారు. అలాగే 24నుంచి జూలై 24 వరకు పోలింగ్ కేంద్రాల పరిశీలన, ఓటరు జాబితాలో సవరణలు, ఆగస్టు 2 నుంచి 31 వరకు ఓటరు జాబితాపై అభ్యంతరాలు, నూతన ఓటరు దరఖాస్తులను స్వీకరించాలని తెలిపారు. శని, ఆదివారాలు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు.

సెప్టెంబర్ 22 లోపు పరిష్కరించి, అక్టోబర్ 4న తుది జాబితా సిద్దం చేయాలన్నారు. వీటిని తహసిల్దార్లు పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో పెద్దపల్లి, మంథని ఆర్డీఓలు వెంకట మాధవరావు, వీరబ్రహ్మచారి , తహసిల్దార్‌లు, ఎన్నికల డీటీ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News