Monday, December 23, 2024

పకడ్బందీగా ఓటర్ల జాబితా సవరణ

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల : 2వ ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమాన్ని ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం జిల్లా లోని నస్పూర్‌లో గల సమీకృత జిల్లా శాఖల కార్యాలయ భవన సముదాయంలో ఆర్డీవోలు దాసరి వేణు, శ్యామలాదేవి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా వసరణ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాబితా ప్రత్యేక సంక్షిపత్త సవరణ కార్యక్రమం 2023ను జిల్లాలో సక్రమంగా నిర్వహించాలని, అక్టోబరు 1 నాటికి 18 సంతవ్సరాలు నిండిన పౌరులను ఓటర్లుగా నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. బూత్ స్థాయి అధికారుల ద్వారా ఇంటింటి పరిశీలన జరుగుతుందని, జూన్ 24 నుంచి జూలై 24 వరకు పోలింగ్ కేంద్రాల రేషనలైజే షన్, ఓటర్ల జాబితాల్లో తప్పుడు వివరాల తొలగింపు, పోలింగ్ కేంద్రాల పరిధి నిర్దారణ, జూలై 25 నుంచి 31వ తేదీ వరకు ఫార్మట్ 1 నుంచి 8 వరకు ముసాయిదా జాబితా రూపకల్ప, ఆగస్టు 2న ముసాయిదా జాబితా ప్రచురణ జరుగుతుందని తెలిపారు.

ఆగస్టు 2 నుంచి 31 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఇందుకు రెండు శనివారా లు, రెండు ఆదివారాలు ప్రత్యేక శిబిరాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. సెప్టెంబరు 22న ఫిర్యాదులు, అభ్యంతరాలు స్వీకరిం చి పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.

అక్టోబరు 4న తుది ఓటరు జాబితా ప్రచురించడం జరుగుతుందని, ఓటర్ల జాబితా సంక్లిప్త సవరణ ప్రక్రియ రాజకీయ పార్టీలు తమ సహకారం అందించి ప్రతి పోలింగ్ కేంద్రానికి బూత స్థాయి ఏజెంట్‌ను నియమించి, వారి వివరాలను జూలై 31 లోగా సంబందిత తహసిల్దార్, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, జిల్లా ఎన్నికల అధికారి బీఎల్‌ఏ 2 (అనాక్స ర్61) నమూనాలో అందించాలని తెలిపారు. సవరణ ప్రక్రియ సమయంలో బూత్ స్థాయిఏజెంట్, బూత్ స్థాయి అధికారులతో కలిసి ముసాయిదా ఓటరు జాబితాలో ఏవైనా లోపాలు, తప్పిదాలు ఉన్నా, అనర్హులు, మరణించిన వారు, ఇరత ప్రాంతాలకు వెళ్లిన వారు, నకిలీగా నమోదు చేసుకున్న వారు ఓటర్ల జాబితా నుండి వివరాలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

గుర్తింపు పొంది న రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ నెల 21 నుంచి ఈసీఎల్ ఇంజనీర్ల ద్వారా ప్రథమ స్థాయి పరిశీలన చేయడం జరు గుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News