Tuesday, April 1, 2025

జీఓ 53 ప్రకారం ఆర్టీసి ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ సవరణ

- Advertisement -
- Advertisement -

వివరణ ఇచ్చిన ఆర్టీసి ఎండి

మన తెలంగాణ/హైదరాబాద్:  ఉద్యోగుల ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ)ను ఆర్టీసి యాజమాన్యం సవరించింది. జీఓ నంబర్ 53 ప్రకారం హెచ్‌ఆర్‌ఏ సవరణ చేయాలని 2020లో ఆర్టీసి యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశించింది. అప్పుడు ఆర్టీసీ ఉద్యోగుల పే రివిజన్ చేయకపోవడంతో హెచ్‌ఆర్‌ఏ సవరణను ఆర్టీసి తాత్కాలికంగా నిలుపుదల చేసింది. తాజాగా 2017 పే స్కేల్‌ను రివిజన్ చేసి ఉద్యోగులకు 21 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జీఓ నంబర్ 53 ప్రకారం ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏపై యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. హెచ్‌ఆర్‌ఏ సవరణపై జరుగుతున్న అసత్య ప్రచారం నేపథ్యంలో టిఎస్ ఆర్టీసి ఎండి సజ్జనార్ వివరణ ఇచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News